శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:27 IST)

'రా' చీఫ్‌గా రాజీందర్ ఖన్నా.. సీఆర్పీఎఫ్‌ డీజీగా ప్రకాశ్ మిశ్రా!

భారత గూఢచర్య సంస్థ ‘రీసర్చి అండ్ అనాలసిస్ వింగ్’ (‘రా’) అధిపతిగా రాజీందర్ ఖన్నా, సీఆర్పీఎఫ్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ మిశ్రాలు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రా చీఫ్‌గా నియమితులైన రాజీందర్ ఖన్నా... రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఆర్ఏఎస్)కు చెందిన 1978 బ్యాచ్ అధికారి. ఈయన రెండేళ్ల పాటు 'రా' చీఫ్‌గా కొనసాగనున్నారు. అలాగే, సీఆర్పీఎఫ్ డీజీ బాధ్యతలు చేపట్టనున్న ప్రకాశ్ మిశ్రా, 1977 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. 
 
ఈయన గతంలో ఒడిశా రాష్ట్ర డీజీపీగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. తాజాగా మావోల అణచివేతలో కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశ్యంతో ఆయనను సీఆర్పీఎఫ్‌ చీఫ్‌గా ఎంపికయ్యారు.