శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (12:57 IST)

లింగా సినిమా కోసమే జయకు రజనీకాంత్ మద్దతు!

బెయిల్‌పై విడుదలై చెన్నై పోయస్‌గార్డెన్‌లోని తన నివాస గృహానికి చేరుకున్న సందర్భంగా రజినీ కాంత్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసినట్లు అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో మీ రాక (అమ్మ) తమిళ ప్రజలకు అమితానందాన్ని ఇచ్చింది. మళ్లీ  మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రశాంతత, ఆరోగ్యం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
అయితే బీజేపీ రజినీ కాంత్‌కు గాలం వేయడంతో పాటు ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడానికి రెడీ అయిన పరిస్థితిలో రజని అమ్మ క్షేమం కోరుతూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 
 
కానీ రజనీ తాజా చిత్రం లింగా డిసెంబర్ 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తతోనే రజనీకాంత్ అమ్మరాకకు హర్షం వ్యక్తం చేస్తూ లేఖ రాశారనే ప్రచారం జోరందుకుంది.