Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీకాంత్‌కు ఇంగ్లీష్ రాదు.. సీఎంగా పనికిరాడు : సుబ్రమణ్య స్వామి

శుక్రవారం, 19 మే 2017 (16:11 IST)

Widgets Magazine
subramanya swamy

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు విమర్శలు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వస్తున్న వార్తలపై స్వామి గత కొంతకాలంగా ట్వీట్లు చేస్తున్న విషయం తెల్సిందే.
 
ఇప్పటికే రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్వామి.. శుక్రవారం మరోమారు విమర్శలు గుప్పించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు పనికిరారని చెప్పారు. విద్యాధికులైన తమిళ ప్రజలు, అంతగా చదువుకోని రజనీకాంత్‌ని సీఎంగా చూడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరన్నారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్టానం ఇష్టమని స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో చేసిన ట్వీట్‌లో రజనీ కర్నాటకలో పుట్టి.. మహారాష్ట్రలో పెరిగారని, అందువల్ల ఆయన బేసిగ్గా తమిళుడు కాదంటూ పేర్కొన్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ...

news

మిత్రుడిగా భావించిన రజనీకి కృతజ్ఞతలు.. బీజేపీ పట్ల జాగ్రత్త.. రజనీకి స్టాలిన్ సూచన

రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ...

news

పవిత్ర పర్వతంపై ఎక్కింది.. నగ్నంగా ఫోజిచ్చింది.. వివాదంలో చిక్కిన కివీస్ మోడల్..

న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ...

news

నీ బాయ్‌ఫ్రెండ్‌ను నాకిస్తే రూ.కోటిన్నర ఇస్తా... ఓ సంపన్న కుటుంబ మహిళ ఆఫర్

గతంలో జగపతి బాబు, ఆమని హీరోహీరోయిన్లుగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ...

Widgets Magazine