శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (14:32 IST)

వారం రోజుల్లో సివిల్స్ సమస్య పరిష్కరిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

సరిగ్గా వారం రోజుల్లో సివిల్స్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీ అభ్యర్థులు నిరసనలపై ఆయన ఢిల్లీలో సోమవారం స్పందిస్తూ ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఇంగ్లీష్ మాట్లాడని అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వీరు వాపోతున్నారు. 
 
ఈ క్రమంలో యూపీఎస్సీ వివాదాన్ని వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీ అభ్యర్థుల ఆదివారం కూడా ఢిల్లీలో కొనసాగించారు. 
 
మరోవైపు యూపీఎస్పీ అభ్యర్థులు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు కోరారు. తమ డిమాండ్‌ పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. అయితే, ఈ విషయంలో తమవైపు ఉంటామని రాహుల్ హామీ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. పరీక్షలోని ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఇంగ్లీష్ మాట్లాడని అభ్యర్థుల పట్ల వివక్ష చూపినట్లేనని ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని పరీక్ష నమూనాలో మార్పులు చేయాలని కోరారు.