శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 14 జులై 2014 (15:18 IST)

అపుడు భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్‌దే : రాజ్‌నాథ్ సింగ్

భద్రాచలం పట్టణం కూడా 1958కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నదని, కానీ ఇపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రచాలం పట్టణం మినహా మిగిలిన ఏడు ముంపు మండలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి సోమవారం మధ్యాహ్నం 2.17గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.
 
1958లో ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవని ఆయన గుర్తు చేశారు. భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ను లోక్‌సభ ఆమోదించిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజ్నాథ్ తెలిపారు.