మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:17 IST)

హైదరాబాద్‌పై అధికారాలు గవర్నర్ చేతిలోనే : రాజ్‌నాథ్ సింగ్

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై అధికారాలు గవర్నర్ నరసింహన్ చేతిలోనే ఉంటాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలనే తాము అమలు చేస్తున్నామని తెలిపారు. 
 
ఇకపోతే.. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా టీ సీఎం కేసీఆర్ మీడియాపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో, కేసీఆర్‌తో తాను మాట్లాడతానని... చానళ్ల పునరుద్ధరణపై కూడా ఆయనతో చర్చిస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారు. 
 
వరదల కారణంగా కకావికలమైన కాశ్మీర్‌లో సహాయక చర్యలను సైన్యం అద్భుతంగా నిర్వర్తించిందని ఆయన కితాబిచ్చారు. సుమారు 1.30 లక్షల మంది బాధితులను ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో చాకచాక్యంగా రక్షించాయని రాజ్‌నాథ్ సింగ్ గొప్పగా చెప్పుకొచ్చారు.