శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:43 IST)

ఉగ్రవాదాన్ని రాజకీయం చేయొద్దు.. వారు పాక్ నుంచే వచ్చారు : రాజ్‌నాథ్

దేశంలో జరుగుతున్న ఉగ్రవాదదాడులను రాజకీయం చేయొద్దని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దాడిచేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌ నుంచే వచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ ఘటనపై శుక్రవారం లోక్‌సభలో ఆయన ఓ ప్రకటన చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ... ఉగ్రవాదానికి మతం, కులం, ప్రాంతం ఉండవన్నారు. హిందూ ఉగ్రవాదం అనే పదం వాడవద్దని, దీనివల్లే ఉగ్రవాదంపై భారత్ వైఖరి చులకనైందని రాజ్‌నాథ్ ఆవేశంగా అన్నారు. 
 
గురుదాస్‌పూర్ దాడిలో మిలిటెంట్ల నుంచి మూడు ఏకె 47, 19 తుపాకులు, జీపీఎస్‌ సామాగ్రి, మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసులకు ఆయన ఆర్పించారు. ఉగ్రవాదులు జమ్మూ - పాటన్‌ కోట్‌ రైలు మార్గంలో ఐదు మందు పాతరలు కూడా అమర్చారని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.