Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్‌కు రాజ్యాభిషేకం

మంగళవారం, 25 జులై 2017 (12:29 IST)

Widgets Magazine
ramnath kovind

భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయనతో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఖేహ‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది.
 
భార‌త రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా కొత్త రాష్ట్రపతి రాంనాథ్ అన్నారు. దేశ ప్ర‌జ‌లకు సేవ చేస్తాన‌ని కూడా ఆయ‌న శ‌ప‌థం చేశారు. రాష్ట్రపతిగా ప్ర‌మాణం చేసిన రాంనాథ్‌ను మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ సీటుపై కూర్చోబెట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ, ఉపరాష్ట్ర హామీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
 
అంతకుముందు.. తొలుత రాజ్‌ఘాట్‌లో మ‌హాత్ముడికి నివాళి అర్పించి ఆ తర్వాత త‌న స‌తీమ‌ణితో క‌లిసి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో ఉన్న కొన్ని రూమ్‌ల‌ను క‌లియ‌తిరిగారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో గ‌త అయిదేళ్ల తాను తీసుకువ‌చ్చిన మార్పుల‌ను ప్ర‌ణ‌బ్ నూత‌న రాష్ట్ర‌ప‌తికి వివ‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్ర‌త్యేక వాహ‌నంలో పార్ల‌మెంట్‌కు చేరుకుని, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డీఎస్పీని రాళ్ళతో కొట్టి చంపిన ఉగ్రవాది ఎన్‌కౌంటర్...

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపిన ఉగ్రవాదిని ఆ ...

news

అవినీతిలో ఎడప్పాడి సర్కారు.. కమల్ నిజం మాట్లాడారు... : విజయకాంత్

తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని ...

news

నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీల వీడియోలు.. ఆడియో క్లిప్‌లు.. ఎక్కడ?

నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీల వీడియోలు, ఆడియో క్లిప్‌లను కూడా సౌదీ అరేబియా చేర్చింది. ...

news

వర్షం జాడ కనిపెట్టే కేరళ వాసి... ఎలా?

ఓ వ్యక్తి వర్షం జాడ(రాక)ను ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. అదీకూడా గత 34 యేళ్ళుగా ఖచ్చితంగా ...

Widgets Magazine