శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (14:00 IST)

రాష్ట్రపతిగా ఉన్నా... పుట్టినగడ్డ నేలపై కూర్చొని భోజనం చేయడమే అమితమైన ఇష్టం!

భారత రాష్ట్రపతిగా ప్రపంచాన్ని చుట్టివచ్చినప్పటికీ.. తన పురిటిగడ్డ రామేశ్వరం అంటే అబ్దుల్ కలాంకు అమితమైన ఇష్టం. చిన్నప్పుడు తన మాతృమూర్తితో కలిసి ఎక్కడైతే కూర్చొని భోజనం చేసేవారో... రాష్ట్రపతి అయిన తర్వాత కూడా అదే నేలపై కూర్చొని తినేవారు. ఇది ఆయనకు పుట్టినగడ్డపై ఉన్న మమకారాన్ని చాటిచెపుతుంది.
 
 
అంతేనా... ‘వ్యవస్థను మార్చాలనుకుంటే.. అవాంతరాలను అధిగమించాల్సిందే’ తన చిన్ననాటి గురువు శివ సుబ్రమణ్యం అయ్యర్‌ చెప్పిన మాటలే.. తనను అత్యున్నత శిఖరాలకు చేర్చాయని అనేక సందర్భాలలో కలాం గుర్తుచేసుకునేవారు. స్కూల్లో చదువుతున్నప్పుడు.. తన ఇంటికి భోజనానికి రావాలని కలాంను సుబ్రమణ్యం ఆహ్వానించారు. గత అనుభవాలతో కలాం సంకోంచించారు. దాంతో సుబ్రహ్మణ్యం స్వయంగా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు.
 
అంతేకాకుండా, ప్రతి ఒక్కరీ ఒకే తల్లి ఉంటుంది. నాకు మాత్రం ముగ్గురమ్మలు అని వినమ్రయంగా ప్రకటించిన జ్ఞానిశీలి. ‘‘ప్రతి ఒక్కరికీ ఒక్కరే తల్లి.. కానీ నాకు ముగ్గురు తల్లులు’’ అంటూ కలాం చెప్పేవారు. జన్మనిచ్చిన తల్లి ఆషియమ్మతోపాటు దివంగత సంగీత విద్వాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, సామాజిక సేవకురాలు మదర్‌థెరిస్సా కూడా తన తల్లులేనని చెప్పేవారు. 
 
అలాగే, హఠాన్మరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా భారత యువతకు ఓ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ‘‘అందరిలా కాకుండా... కొత్తగా ఆలోచించండి. ఎవ్వరూ నడవని బాటలో నడవండి. కొత్త విషయాలు కనిపెట్టండి. ‘అసాధ్యం’ అనుకుంటున్నవి ఛేదించేందుకు, సమస్యలపై విజయం సాధించేందుకు సాహసించండి. ఈ లక్షణాలను అలవరచుకునే దిశగా కదలండి. యువతకు నేను ఇచ్చే సందేశం ఇదే.’’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.