Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రమ్య మళ్లీ వివాదంలో చిక్కుకుంది.. యువకుడితో వాగ్వివాదం.. అనుచరులతో దాడి..

మంగళవారం, 29 నవంబరు 2016 (12:18 IST)

Widgets Magazine
actress ramya

మాజీ కాంగ్రెస్ ఎంపీ, నటీమణి రమ్య మళ్ళీ వివాదంలో చిక్కుకుంది. ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఓ హామీకి కట్టుబడి ఉండాలంటూ.. ఓ యువకుడు ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకుడిపై రమ్య అనుచరులు దాడి చేశారు. గమనించిన స్థానికులు దాడి నుంచి అతన్ని రక్షించారు. 
 
అసలు విషయమేంటంటే.. మండ్య నియోజకవర్గ ఎంపీగా ఉన్న సమయంలో వన్ ఇండియా వన్ ఎంపీ కార్యక్రమంలో ప్రారంభించారు రమ్య. కార్యక్రమంలో భాగంగా.. సామాజిక స్థితిగతులు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై థీసిస్ రాసినవారికి రూ.2.5 లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో దాదాపు 117మంది యువకులు అనేకానేక సమస్యలపై, వాటి పరిష్కార మార్గాలపై థీసిస్ రాసి సమర్పించారు. 
 
అలా థీసిస్ సమర్పించినవారిలో చిక్కమురళి గ్రామానికి చెందిన పాండుదురై ఒకరు. థీసిస్ అయితే సమర్పించారు గానీ అనంతరం జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో రమ్య ఓడిపోవడంతో.. ఆ థీసిస్‌ను ఆమె పట్టించుకోలేదు. దీంతో రమ్యను ఎలాగైనా కలవాలని పాండుదురై చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేశాడు.
 
ఈ క్రమంలో సోమవారం నాడు మండ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రమ్య వస్తున్నట్లు సమాచారం అందుకున్న పాండుదురై.. కలెక్టరేట్ వద్దకు చేరుకుని రమ్యను నిలదీశాడు. ప్రస్తుతం తాను ఎంపీని కాదని, ప్రస్తుత ఎంపీని లేదా కలెక్టర్ ను దీనిపై సమాధానం అడగాలని రమ్య బదులిచ్చారు. 
 
కానీ చిక్కమురళి రమ్య వద్ద ఓవరాక్షన్ చేయడంతో.. విసిగిపోయిన రమ్య.. నువ్వో రౌడీలా వ్యవహరిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలోనే రమ్య అనుచరులు చిక్కామురళిపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు జోక్యం చేసుకుని యువకుడిని విడిపించారు. అనంతరం స్థానికులంతా ఏకమై రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అర్థరాత్రి బయటకు పంపి గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసున్న అన్ను చంపిన తమ్ముడు

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...

news

జవాన్ తలను కిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముంది: భారత ఆర్మీ

జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ ...

news

కడలూరు ఆలయంలో నేలమాళిగ... తపో సమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పురాతన ఆలయంలో సువిశాలమైన నేలమాళిగ వెలుగు చూసింది. అందులో ...

news

భార్య లేచిపోయిందన్న అక్కసుతో కూతుర్ని చంపి.. అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రి

ఓ తండ్రి కసాయిగా మారిపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. ఆమె పాలిట కిరాతకుడిగా ...

Widgets Magazine