Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి ఎఫెక్ట్.. రానా వాహనం స్ఫూర్తితో ''దుర్గ్‌ రోడ్ క్లీనర్''

గురువారం, 15 జూన్ 2017 (12:06 IST)

Widgets Magazine
rana in bahubali

బాహుబలి సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు బాహుబలిగా అభివర్ణించుకుంటున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మున్సిపాలిటీ ఓ అడుగు ముందుకేసింది. బాహుబలి సినిమాలో యుద్ధ సమయంలో భల్లాలదేవ (రానా) రథం శత్రుమూకను ఎలా ఛండాడిందో.. సినిమా చూసిన ప్రతివారికీ గుర్తుండే వుంటుంది. అలాంటి రథంతోనే ఓ వాహనాన్ని తయారు చేసింది. 
 
ఈ వాహనం దుర్గ్ రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని ఊడ్చిపారేస్తోంది. బాహుబలి సినిమాలో భల్లాలదేవ రథానికి ఉన్న కత్తుల స్థానంలో దుర్గ్ వాహనానికి చీపుర్లున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను తగ్గించాలనుకున్న దుర్గ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తక్కువమంది సిబ్బందితోనే దుర్గ్‌రోడ్లు తళతళలాడిపోతున్నాయని మున్సిపాలిటీ అధికారులు చెబతున్నారు.
 
ఈ వాహనానికి మున్సిపాలిటీ... 'దుర్గ్‌ రోడ్ క్లీనర్' అని పేరుపెట్టింది. అయితే, ఆ వాహనం రోడ్డుపై చెత్తా, చెదారాన్ని శుభ్రం చేస్తున్న సంగతిని పక్కనబెడితే.. ఆ వాహనం చీపుర్లు తిరిగే స్పీడుకు రోడ్లపైన చెత్తా, చెదారం రోడ్ల పక్కన ఉన్న షాపులు, వాహనాలు, ప్రజలపైనా చెత్తాచెదారం పడుతోందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెనజీర్ భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ కోసం కొట్టుకున్న అతిథులు..

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ ...

news

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత: నటుడు-జర్నలిస్ట్-స్పోర్ట్స్‌‌ఇన్‌స్ట్రక్టర్ ఏకమయ్యారు..

కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు ...

news

టీడీపీ మంత్రుల మధ్య ల్యాండ్ వార్ : చంద్రబాబు చెంతకు చేరిన పంచాయతీ

విశాఖపట్టణం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చెలరేగిన ...

news

యువతితో వివాహేతర సంబంధం వద్దన్నదనీ భార్యను భర్త ఏం చేశాడంటే...

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. ఓ యువతితో అక్రమ సంబంధం వద్దని ...

Widgets Magazine