శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 23 నవంబరు 2014 (17:01 IST)

ఆరేళ్ల చిన్నారిపై లేడీ టీచర్ లైంగిక దాడి... బెంగళూరులో....

బాలికలపై లైంగిక దాడులకు కేరాఫ్ అడ్రెస్ గా బెంగళూరు మారిపోతోంది. బాలికలపై తరచుగా చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై స్కూలు సిబ్బందే లైంగిక దాడులకు పాల్పడటంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా బెంగళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉపాధ్యాయురాలు లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన కలకలం రేపింది. తనపై లైంగిక దాడి జరిగిందని బాలిక నిర్ధారించిందని, నొప్పిగా ఉందని బాలిక ఏడుస్తుండడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని ఓ పోలీసు అధికారి వివరించారు. 
 
కాగా బాలిక చదువుకుంటున్న ఈ పాఠశాలను ఓ మహిళ నిర్వహిస్తోంది. ఆమె భర్త ఓ బేకరీ యజమాని. ఘటనపై నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ... కేసు దర్యాప్తులో ఉందనీ, మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులతోపాటు ఇతర పేరెంట్స్ కూడా ఆందోళన బాట పట్టారు.