శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (15:24 IST)

కన్నడ నటిపై కన్నడ నిర్మాత అత్యాచారయత్నం : కేసు నమోదు.. బెదిరింపులు

కన్నడ సినీ నటిపై ఆ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాత అత్యాచారయత్నానికి పాల్పడినట్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
శివమొగ్గలో 'బిసిలు కుదురే' (వేడి గుర్రం) అనే షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో బెంగుళూరుకు చెందిన ఓ యువ నటి నటిస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, నిర్మాత కుమార్ మాట్లాడాలంటూ తనను గెస్ట్ హౌస్‌కు రమ్మన్నాడని, వెళ్లిన తర్వాత అత్యాచారయత్నం చేశాడని ఆమె ఆరోపించింది. 
 
ఈ మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం అక్కడ నుంచి బెంగళూరు చేరుకుని చలనచిత్ర వాణిజ్య మండలి, మహిళా మండలికి కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన భర్త సదరు నిర్మాతకు ఫోన్ చేస్తే... కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.