మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (12:32 IST)

కాళ్ళు చేతులు కట్టేసుకుని... అత్యాచారం చేశారనీ...యువతి డ్రామా.. ఎక్కడ?

నచ్చిన వాడితో తల్లిదండ్రులు పెళ్ళికి నో చెప్పారు... వేరే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇలా అయితే ఇష్టం లేని పెళ్ళే చేసేస్తారని ఓ అమ్మాయి కొత్త డ్రామా మొదలు పెట్టింది. పెళ్లి సంబంధాలు రాకుండా చేసుకోవడానికి అత్యాచారం సీన్ క్రియేట్ చేసింది. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. వివరాలిలా ఉన్నాయి. 
 
తమిళనాడు ఈరోడ్డులోని ఓ యువతి హాస్టల్‌లో ఉంటూ ఏడాదిగా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే జులై 28వ తేదీన హాస్టల్ రూమ్లో కాళ్లు చేతులు బంధించబడి ఉన్న యువతిని చూసిన హాస్టల్ సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిపింది. దాంతో వారు శరవణంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతిని ప్రశ్నంచగా, ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు. 
 
తనపై అత్యాచారం జరిగిందంటే తనకు పెళ్లి సంబంధాలు రావనీ తరువాత తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చునని నాటకమాడినట్లు ఆమె చెప్పంది పిచ్చి వేషాలు వేసి పోలీసులను తప్పు దోవ పట్టిస్తే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ యువతితో ఆమె తల్లిదండ్రులను హెచ్చరించారు.