శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (11:30 IST)

మోడీ కుర్తా వేసుకోవాలనుంది: బరాక్ ఒబామా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుర్తాపై అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆశపడ్డారు. మోడీ కుర్తా వేసుకోవాలని ఉంది అని రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే అన్నారు. 
 
భారత్ - అమెరికా మధ్య 'దోస్తీ' మరింత పెరగాలని, తనకు మోడీ కుర్తా వేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. 
 
మీ ఆతిథ్యాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని అన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.ఒకప్పుడు చాయ్ అమ్ముకొనే వ్యక్తి తనయుడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానిగా మమ్మల్ని ఆహ్వానించారు.
 
కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోడీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు.
 
తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. నేను ఐదు గంటలు నిద్రపోతున్నందుకు ఆనందం కలిగిందని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైల్ కూడా ఉందని అన్నారు.
 
2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మిషెల్లీ ఒబామా తర్వాత తన స్టైల్ ఐకాన్ ఎవరంటే మోడీనే అన్నారు.