శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (14:27 IST)

అతి తెలివితేటలు వద్దు: రూ.2 వేల నోట్లు దాచుకోవాలని ప్రయత్నిస్తే అంతే సంగతులు...

భారత రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను దాచుకోవాలని ప్రయత్నించే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.వెయ్యి నోట్ల స్థానంలో రూ.2 వేలు నోట్లను మరింతగా దాచుకోవచ్చని పలువు

భారత రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను దాచుకోవాలని ప్రయత్నించే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.వెయ్యి నోట్ల స్థానంలో రూ.2 వేలు నోట్లను మరింతగా దాచుకోవచ్చని పలువురు భావించొచ్చు. ఇలాంటి ఆలోచన నల్లకుభేరులకు రావొచ్చు. వారు భావిస్తున్నట్టుగా నల్లధనం రూపంలో రూ.2 వేలను దాచుకుంటే మీ గుట్టు బయటపడుతుంది. అదెలాగంటారా? ఈ కథనం చదవండి.
 
భారతీయ రిజర్వు బ్యాంకు దేశ చరిత్రలోనే తొలిసారిగా నానో టెక్నాలజీ చిప్‌సాయంతో కొత్తగా రూ.2 వేల నోటును గురువారం విడుదల చేసింది. ఈ నోటు ఆవిష్కరణకు ఉపయోగించిన సాంకేతికత ఫలితంగా బ్లాక్‌మనీకి బ్రేక్‌ వేయడంతోపాటు నకిలీనోట్లకు తావేలేని పరిస్థితి నిర్మాణం కానుందని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. 
 
బెంగళూరులోని సాంకేతిక నిపుణులు అందించిన సమాచారం ప్రకారం కొత్తగా సిద్ధం చేసిన నానో టెక్నాలజీ చిప్‌ సాంకేతికతను అమర్చిన రూ.2 వేల నోటు ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్‌ను గ్రహించి ఆ నోటు ఉండే ప్రదేశాన్ని తెలియచేస్తుంది. ఉపగ్రహం నుంచి సిగ్నల్‌ అందగానే ఈ నోటులోని ఎన్‌సీజీ తిరిగి సిగ్నల్‌ను పంపుతుంది. ఈ విధంగా రూ.2 వేల రూపాయల నోట్లు ఎన్ని, ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని పసిగట్టి ఆదాయపన్నుశాఖకు సమాచారం చేరవేస్తుంది. 
 
ఈ లెక్కన ఇకపై 2 వేల నోట్ల కట్టలను భారీగా దాచుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ సొంత తెలివితేటలు ప్రయోగించి నోటులోని అత్యంత సూక్ష్మమైన కంటికి కనిపించని నానో టెక్నాలజీ చిప్‌ను తొలగించాలని ప్రయత్నిస్తే నోటు ఎందుకు పనికిరాకుండా పోతుందట. రూ.2 వేల నోట్ల కట్టల రూపంలో బ్లాక్‌మనీ భారీగా పేరుకుంటే ఆదాయపన్నుశాఖ అధికారులు వ్యూహాత్మకంగా దాడులు జరిపి క్షణాలలో స్వాధీనం చేసుకునే అవకాశం లభిస్తుంది. 
 
సాంకేతికతను ఇదే మొదటిసారి కరెన్సీని సద్వినియోగం చేసుకునేందుకు వినియోగించడం శుభ పరిణామమన్నారు. అయితే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం 2 వేల నోట్లలో ఎలాంటి చిప్‌లు గిప్‌లు లేవని కొట్టిపారేసింది. ఇవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. మరి ఆర్బీఐ చెపుతున్నది నిజమో కాదో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.