శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (19:53 IST)

ఆర్కేనగర్ బరిలో జయలలిత : అమ్మపై ఖుష్బూ పోటీకి సై...?

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో.. తమిళనాడు సీఎంగా మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, తమ అధినేత్రి కోసం ఆర్కే నగర్ ఎమ్మెల్యే వెట్రివేలు తన పదవికి రాజీనామా చేశారు.

జూన్ 27న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో జయపై సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, డీఎంకే కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.
 
కాగా ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జూన్ 27న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితాలో తమిళనాడులోని రాధాక్రిష్టన్ నగర్ (ఆర్కే నగర్) కూడా ఉంది. ఇటీవలే ముఖ్యమంత్రి పీఠమెక్కిన జయలలిత ఈ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి గెలిచిన పి.వెట్రివేల్ జయలలిత పోటీకి వీలుగా.. ఇటీవలే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.