గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (10:36 IST)

శశికళ పేరుతో ఓట్లు అడగొద్దు.. ఆమె ఫోటో కూడా కనిపించకూడదు : నేతలకు దినకరన్ సూచన

ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఈయన టోపీ గుర్తుపై బరిలో

ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఈయన టోపీ గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. 
 
ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న నేతలకు కీలక సూచనలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరును ప్రచారంలో వినియోగించవద్దని, ఆమె పేరు చెప్పి ఓట్లను అడగవద్దని కోరారు. 
 
అలాగే, ప్రచార బ్యానర్లలో ఎంజీఆర్, జయలలిత ఫోటోలు పెద్దవిగా ఉంచాలని, తన చిన్న ఫోటో చాలని, శశికళ ఫోటో ఎక్కడా కనిపించకూడదని పేర్కొన్నారు. శశికళపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున, ఆ ప్రభావం తనపై పడరాదన్న భావనతోనే దినకరన్ ఈ సూచనలు చేసినట్టు సమాచారం.