మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (08:47 IST)

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారం జరిపి... ఆ తర్వాత నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం పరీక్షలో వాస్తవాలు వెలుగు చూపాయి. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యులు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన యువతి పుర్రెలోని ఎముకలు ఛిద్రమయ్యి. నిందితులు ఆమె జననావయవంలో పదునైన వస్తువులను చొప్పించి గాయపరిచారని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, ఈ గ్యాంగ్ రేప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతురాలు మాత్రమే కాకుండా, ప్రధాన నిందితుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తని సిట్ అధికారి షెన్వి వెల్లడించారు.