గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (13:34 IST)

భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్!

న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో కొత్త కార్యదర్శిగా ఎస్. జైశంకర్ నియమితులయ్యారు. దీంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని చెప్పారు. ఈ సందర్భంలో విదేశాంగ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్. జైశంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 
అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్. జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు వచ్చిన వెంటనే, జైశంకర్ బాధ్యతలు స్వీకరించారు.
 
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్ర జైశంకర్ నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను పదవి నుంచి తప్పించి, జైశంకర్‌ను నియమించడం అన్యాయమని పేర్కొంది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన ముగిసిన తర్వాతి రోజే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, సుజాతా సింగ్ ఆ పదవి నుంచి అమార్యదగా తప్పించారని కాంగ్రెస్ పార్టీ లీడర్ మనిష్ తివారీ ట్విట్టర్‌లో మోడీ ప్రభుత్వంలో ఆరోపణలు చేశారు.