Widgets Magazine Widgets Magazine

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్ - నటి రేఖ

సోమవారం, 17 జులై 2017 (15:42 IST)

Widgets Magazine
sachin  - rekha

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే తమతమ నియోజకవర్గాల నుంచి రాజధానులకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
అయితే, రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ పోలింగ్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. కానీ రాజ్య‌స‌భ ఎంపీలే అయిన మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్ మాత్రం ఓటు వేయ‌డం లేదు.
 
ఎందుకంటే.. వీరంతా నామినేటెడ్ సభ్యులు. రాష్ట్ర‌ప‌తి వీళ్ల‌ను నామినేట్ చేస్తారు. అందుకే ఆ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌లో ఓటు వేయ‌డానికి వీళ్లు అర్హులు కాదు. వీళ్లే కాదు.. రాజ్య‌స‌భ‌లో మొత్తం 12 మందిని, లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు ఆంగ్లో ఇండియ‌న్స్‌ను రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేస్తారు. దీంతో ఈ 14 మందికి ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు.
 
ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో ఈ న‌లుగురితోపాటు మలయాళ సురేశ్ గోపి, రూపా గంగూలీ, న‌రేంద్ర జాద‌వ్‌, స్వ‌ప‌న్ దాస్‌గుప్తా, కేటీఎస్ తుల‌సి, ప‌రాశ‌ర‌ణ్‌, అను ఆగా, శంభాజీ రాజెల‌ను రాజ్య‌స‌భ‌కు రాష్ట్రపతి నామినేట్ చేశారు. వీళ్లంతా వివిధ రంగాల్లో ప్ర‌ముఖులు. వీరందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్యాలెట్ పేపర్ ఎక్కడ వేయాలో తెలియని తెరాస ఎమ్మెల్యే.. క్లాస్ పీకిన హరీష్

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. ...

news

స్వీటీని చూసి సంబరపడిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్...

స్వీటీని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సంబరపడిపోయారు. స్వీటి అనగానే బాహుబలి అనుష్క ...

news

అలా అయితే.. ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఫైర్‌బ్రాండ్‍!

ఆర్కే. రోజా. సినీనటి. ప్రస్తుతం వైకాపా తరపున నగరి శాసనసభ సభ్యురాలు. ఆమె పేరు వింటేనే ...

news

రూ.2 కోట్ల లంచంతో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు.. లీక్ చేసిన జైళ్ళ డీఐజీపై బదిలీ వేటు

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షపడి బెంగుళూరు సెంట్రల్ శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...