శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (12:23 IST)

టీటీడీకి షిరిడీ బాధ్యతలను అప్పగించాలి: రాజ్ ఠాక్రే డిమాండ్

మరాఠీలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. తమ ప్రాంతీయతను కాపాడుకునేందుకు వారు ఎంతదాకైనా వెళ్తారు. ఈ తరహా ప్రాంతీయాభిమానాన్ని మరాఠీ ప్రజల్లో పెంచి పోషించింది బాల్ ఠాక్రే నేతృత్వంలోని శివసేననే అన్న సంగతి తెలిసిందే. బాల్ ఠాక్రే జీవించి ఉన్నంతకాలం శివసేనలోనే ఉన్న రాజ్ ఠాక్రే, ఈ విషయంలో కీలక భూమిక పోషించారు. బాల్ ఠాక్రే మరణించిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో విభేధించిన రాజ్ ఠాక్రే శివసేనను వదిలేసి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. 
 
తాజాగా ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఏపీలోని తిరుమల వెంకన్న ఆలయ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) షిరిడీ బాధ్యతలను అప్పగించాలని రాజ్ ఠ్రాకే డిమాండ్ చేస్తున్నారు.
 
ఎందుకంటే, షిరిడీ ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందట. షిరిడీ ఆయల సేవలను, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, షిరిడీ నిర్వహణను టీటీడీకి అప్పగించాలని ఠాక్రే వాదిస్తున్నారు.