శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (11:19 IST)

కృష్ణజింక వేట కేసులో సల్మాన్ నిర్దోషి: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడి హతమార్చాడన్న కేసులో ఆయన్ను దోషిగా కింది కోర్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 1998 అక్టోబరులో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ అడవుల్లోకి వెళ్లిన సల్మాన్, హీరోయిన్లు సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లతో కలసి కృష్ణ జింకలను వేటాడారన్న అరోపణలు వచ్చాయి. 
 
ఈ కేసులో సల్మాన్ మినహా మరెవరిపైనా ఆధారాలు లభ్యంకాకపోవడంతో జోథ్‌పూర్ ట్రయల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, దానిపై హైకోర్టు స్టే విధించింది. కేసును తాజాగా విచారించిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం, సల్మాన్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడుతూ, ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.