గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (07:39 IST)

డోరు తెరుచుకోలేదు... అందుకే డ్రైవర్ వైపు నుంచి దిగా... సల్మాన్

ప్రమాద సమయంలో తాను కూర్చుని ఉన్న వైపున కారు డోర్ తెరుకోకపోవడంతో తాను డ్రైవర్ వైపు నుంచి దిగవలసి వచ్చిందని బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోర్టు చెప్పారు. అటువైపు దిగడం వలన తాను కారు నడిపినట్లు కాదని ఆయన అన్నారు. అదే సమయంలో కారును తాను నడుపుతున్నట్లు ఆయన డ్రైవర్ అశోక్ సింగ్ తెలిపారు. విచారణ వివరాలిలా ఉన్నాయి.
 
2002 సెప్టెంబర్ 28న జరిగిన కారు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా,  నలుగురికి గాయాలయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ మద్యం సేవించి, కారు నడిపినట్లు  ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ కేసులో శుక్రవారం  సల్మాన్ ఖాన్  సరికొత్త  సాక్ష్యాన్ని కోర్టు  నమోదు చేసింది. ఆ సమయంలో కారును తాను నడపలేదని, మద్యం కూడా తాగి లేనని కోర్టులో తెలిపారు.
 
అంతకు ముందు సాక్ష్యం ఇచ్చినవారిలో ఒకరు మాత్రం ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతుండగా తాను చూసినట్లు కోర్టులో చెప్పారు. సల్మాన్  మాత్రం అదేమీ లేదంటున్నారు. ఆ సమయంలో తన వైపున్న డోర్ తెరుచుకోకపోవడంతో  డ్రైవర్ సీటు వైపు నుంచి కిందకు దిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్  కారు నడుపుతున్నట్లు సల్మాన్ చెప్పారు.