శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (09:08 IST)

సల్మాన్ ఖాన్‌పై రేప్ విక్టిమ్ సునీత ఫైర్: రేప్ కల్చర్ పట్ల ఆయన ఆలోచన విధానం అదే!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను రేప్ వ్యాఖ్యలు వదిలిపెట్టేలా లేదు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ చేసిన రేప్ విక్టిమ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సుల్తాన్ షూటింగ్‌లో తాను పడిన కష్టం.. రేప్ బ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను రేప్ వ్యాఖ్యలు వదిలిపెట్టేలా లేదు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ చేసిన రేప్ విక్టిమ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సుల్తాన్ షూటింగ్‌లో తాను పడిన కష్టం.. రేప్ బాధితురాలి తరహాలో ఉన్నదని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీంతో సల్మాన్ తండ్రి సలీమ్ క్షమాపణలు కూడా చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో... సల్మాన్ ఖాన్ వ్యవహారంలో ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ సల్మాన్ ఖాన్‌‌‌‌‌‌‌‌కు బహిరంగ లేఖ రాశారు. గతంలో గ్యాంగ్ రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు గురైన ఆమె ఈ లేఖలో సల్మాన్‌‌ను ఘాటుగా విమర్శించారు. ప్రజ్వల అనే సేవాసంస్థ ద్వారా వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారికి మంచి జీవితాన్నిస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ పేరును ప్రస్తావించడానికి కూడా సునీత ఇష్టపడలేదు. తనను తాను రేప్‌‌‌‌‌‌నకు గురైనట్లు భావించడం అనేది రేప్ కల్చర్ పట్ల ఆయన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుందని చెప్పుకొచ్చారు. 
 
బాలీవుడ్ హీరో అయిన ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విపరీత బుద్ధి ఉన్నవారు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నారు. కాగా సల్మాన్‌కు లేఖ రాసిన సునీత బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రాజు కృష్ణన్, నళిని కృష్ణన్ కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆమె ఎనిమిదేళ్ల వయసులోనే సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పదిహేనేళ్ల వయసులో దళితుల తరఫున ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెపై ఎనిమిది మంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు.