Widgets Magazine

శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్‌గా ఎలా మారాడు?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:34 IST)

Widgets Magazine
ops - sasikala - vidyasagar

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి నుంచి చుక్కలు చూపిస్తున్నారు. సౌమ్యుడు, మృదుస్వభావిగా, అత్యంత విశ్వాసపాత్రుడు, వీరవిధేయుడిగా పేరొందిన పన్నీర్ సెల్వం.. ఇపుడు అచ్చు పొలిటికల్ లీడర్‌గా మారిపోయారు. దీనికి కారణం ఏమిటో పరిశీలిద్ధాం. 
 
ముఖ్యమంత్రి పదవికి శశికళ ఆదేశంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ప్లేటు ఫిరాయించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మంగళవారం రాత్రి ప్రకటించి సంచలన ప్రకటన చేశారు. అదేసమయంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ ఆదేశించారు. ఇదే పన్నీర్‌కు కలిసి వచ్చింది. 
 
ఇప్పటికే శశికళకు చెక్ చెప్పాలని అనుకున్న ఆయన, సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పన్నీర్ దూకుడు పెంచిన వేళ, ఏం చేయాలో పాలుపోని స్థితిలో శశికళ వర్గం ఉన్నట్టు తమిళనాడు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తనకున్న హోదాతో జయలలిత మృతిపై విచారణ జరిపిస్తానని, ఆమె నివాసాన్ని మెమోరియల్ హాలుగా మారుస్తానని చెప్పి ఈ ఉదయం శశికళ వర్గానికి షాకిచ్చిన ఆయన, ఆపై శరవేగంగా పావులు కదిపారు.
 
డీజీపీ, సీఎస్‌లతో సమావేశమై రహస్యంగా శశికళ దాచివుంచిన ఎమ్మెల్యేలను తక్షణం బయటకు తేవాలని ఆదేశాలివ్వడం కూడా ఆయన ఎత్తులో భాగమే. ఆపై బుధవారం నుంచి క్యాంపు రాజకీయాల్లో భాగమైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే ఆయన శిబిరం ఆనందంలో మునిగిపోతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని ...

news

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి ...

news

గవర్నర్‌తో పన్నీర్ భేటీ ఓవర్.. ధర్మమే గెలుస్తుందన్న ఓపీఎస్.. శశిపై స్టాలిన్ ఫైర్

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని ...

news

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ...