Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ సమాధిపై శశి ''శపథం'': పన్నీర్ సెల్వమే టార్గెట్.. సీఎం పదవి కూడానా? ఏమై వుంటుంది?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (11:55 IST)

Widgets Magazine

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష అనుభవించేందుకు బుధవారం నాడు బెంగళూరు బయలుదేరారు. పోయెస్ గార్డెన్ నుంచి రోడ్డు మార్గంలో కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరుకు బయల్దేరే ముందు శశికళ అమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అమ్మ సమాధిపై శపథం కూడా చేసారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, దినకరన్, ఇళవరసిలకు సుప్రీం కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు కోర్టులో లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ కోరింది. సుప్రీం కోర్టు గడువు ఇచ్చేందుకు నిరాకరించింది.
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆమె బెంగళూరుకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో ఆమె బయలుదేరారు. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె ఇద్దరు బంధువులకు ఒక్కొక్కరికి నాలుగేళ్ల కారాగార శిక్ష, రూ.10 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు 2014లో తీర్పునిచ్చింది. అప్పట్లో జయలలితకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా విధించింది.
 
ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళకు బాసటగా నిలిచింది. జయలలిత భారాన్ని ఆమె ఎప్పుడూ తనపై వేసుకునేవారనీ, ఇప్పుడూ అదే చేస్తున్నారనీ పార్టీ ట్విటర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. అయితే అమ్మ సమాధిపై శశికళ చేసిన శపథం ఏమిటనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అమ్మపై శపథం చేసి చిన్నమ్మ జైలుకెళ్తే.. పన్నీర్ సెల్వం పరిస్థితి ఏంటి.? ఆయన్ని టార్గెట్ చేసుకునే చిన్నమ్మ శపథం చేసిందా? లేకుంటే కచ్చతంగా సీఎం పదవి కైవసం చేసుకుంటానని శపథం చేసిందా అని చర్చించుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Bengaluru Roadway Aidmk Paneerselvam Surrender Now Supreme Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

టైమ్ ఇచ్చేది లేదు.. వెంటనే లొంగిపో.. శశికళకు సుప్రీం షాక్.. అమ్మ తరిమేసిన వాడే?

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చిన్నమ్మ జైలు కెళ్లడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరోగ్యం బాగోలేదని ...

news

చిన్నమ్మ జైలుకు.. ఎమ్మెల్యేలు ఇంటికి.. ఐదుగురు గోడదూకి జంప్.. ఎక్కడికెళ్లారు?

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ...

news

జయలలిత, యడ్యూరప్ప బ్యారక్‌లోనే చిన్నమ్మ.. కోర్టులో లొంగిపోనున్న శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

news

రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 25మందికి అస్వస్థత.. ఇంటికి పంపించమని విజ్ఞప్తి.. శశికళ నో..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ ...

Widgets Magazine