Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోల్డెన్ బే రెసార్ట్‌లో చిన్నమ్మ నిద్రలేని రాత్రి.. ఇక రాజకీయ సీన్లొద్దు.. కట్టిపెట్టండి...పనేదో చూడండి..

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:54 IST)

Widgets Magazine

అధికార పీఠం కోసం చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. మరోవైపు పన్నీర్ సెల్వం ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ తన వర్గం నుంచి పన్నీరుకు పోటీగా నేతను అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి వుంది.

ఓవైపు ఊరిస్తోన్న అధికార పీఠం.. మరోవైపు జైలు ఊచలు.. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆలోచనలు సోమవారం రాత్రి నుంచి వీటి చుట్టే తిరిగాయి. అక్రమాస్తుల కేసులో నేటి ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం రాత్రంతా చిన్నమ్మ కంట నిద్ర లేదు. 
 
కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? ప్రతికూలంగా వస్తుందా? అన్న ఆందోళన, ఒకలాంటి బెంగ ఆమెలో కనిపించినట్టు ఆమె తరపు వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పు సానుకూలంగా వచ్చేలా పలువురు దేవతలను శశికళ వేడుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఒకవేళ తాను గనుక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే పగ్గాలు మాత్రం పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆమె రాత్రంతా వ్యూహాలు రచించినట్టు సమాచారం.

అయితే ప్రజలు మాత్రం ఇక శశికళ కథను పక్కనబెట్టి.. రాజకీయ సీన్లకు తెరదించి ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాలని సోషల్ మీడియాలో ప్రజలు సూచిస్తున్నారు. పన్నీర్ సెల్వంను హీరోను చేసిన నెటిజన్లు.. త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుని.. ప్రజా సమస్యల పరిష్కారానికి సమయాత్తమవ్వాలని సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Convicted Panneerselvam Frontrunner Tamil Nadu Cms Post

Loading comments ...

తెలుగు వార్తలు

news

#dacase.... సాయంత్రంలోపు లొంగిపోండి.. శశికళకు సుప్రీం ఆర్డర్ : పన్నీర్ ఇంటికి ఎమ్మెల్యేల క్యూ...

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

news

పన్నీర్‌కే సంపూర్ణ మద్దతు.. అసలు సీన్ ఇకపైనే.. ఓపీఎస్ బల నిరూపణ ఉంటుందా? ఏం జరుగుతుంది?

అక్రమాస్తుల కేసులో మంగళవారం ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. శశికళను దోషిగా ...

news

శశికళ ఆశలు గల్లంతు... చిన్నమ్మతో జైలుకెళ్లనున్న ఇళవరసి - సుధాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై వీకె.శశికళ పెట్టుకున్న కోటి ఆశలు గల్లంతయ్యాయి. జయలలిత ...

news

శశికళకు కన్నీరు- పన్నీర్‌కే పన్నీరు చల్లిన సుప్రీం కోర్టు.. సెల్వం ఇంటివద్ద పండేగ పండగ

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక ...

Widgets Magazine