శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:05 IST)

కూవత్తురుకు పోతున్నా.. ఎమ్మెల్యేల వద్దకు పన్నీర్ సెల్వం.. శశికళను జైలుకు పంపి..?

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎంగ

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాత్తమవుతున్నారు. ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అని తమిళ ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో.. ఓపీఎస్ మీడియాతో మాట్లాడారు. 
 
ధర్మమే గెలుస్తుందని చెప్పారు. తన వర్గానికి ఎమ్మెల్యేలు వలసలు వస్తున్నారని తెలిపారు. అమ్మ ఆత్మ మన వెంటే ఉందని.. రిసార్టులో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను తానే స్వయంగా ఆహ్వానించేందుకు ఓపీఎస్ కూవత్తూరు వెళ్తున్నట్లు చెప్పారు. స్వయంగా కూవత్తురుకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించి..  ప్రభుత్వ ఏర్పాటుకు శశివర్గం నుంచి ఎంతమంది తన వైపు వస్తారోనని తెలుసుకునేందుకు ఆయన రెడీ అయిపోయారు. 
 
అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై నిలిచి పనిచేయాలని ఓపీఎస్ పిలుపునిస్తారని తెలుస్తోంది. అంతేగాకుండా చిన్నమ్మను జైలుకు పంపి.. ఎమ్మెల్యేలను తన వెంట తీసుకొచ్చేందుకే కూవత్తూరు రెసార్ట్‌కు పన్నీర్ సెల్వం వెళ్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.