Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశా. ఇదొక లెక్కా అన్న శశికళ

హైదరాబాద్, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (02:19 IST)

Widgets Magazine

జయలలితతో తన 30 ఏళ్ల అనుబంధంలో వెయ్యిమంది పన్నీర్ సెల్వంలను చూశా. ఈ సంక్షోభం నాకు ఓ లెక్కా అంటూ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్‌ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు.
 
తమిళనాడులో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా  వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్‌ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్‌ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
 
మరోవైపు ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్‌ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా మంగళవారం ఏం జరగబోతోందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతోపాటు పలువురు ఫైల్‌ చేసిన అప్పీళ్లపై జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ అమితవరాయ్‌లతో కూడిన బెంచ్‌ ఉదయం 1030 గంటలకు తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు.
 
అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తమ తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్‌ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలసి ఆయన సోమవారం రాత్రి ఆయన పన్నీర్‌ గూటికి చేరారు. దీంతో పన్నీర్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్‌ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్‌ ఎద్దేవా చేశారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అల్లర్లు జరిగే అవకాశం.. తమిళనాడులో హైటెన్షన్.. ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న ...

news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14

దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా. సంయుక్త ...

news

డబుల్ గేమ్ శశికళ...?! మంగళవారం నాడు పటాపంచలు... ఎలాగంటే?

అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ డబుల్ గేమ్ ఆడుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ ...

news

ఫ్లోర్ టెస్టుతో శశికళ-పన్నీర్ వార్‌కు ఫుల్‌స్టాప్: వారంలోపు అసెంబ్లీ-జయ కేసుపై తీర్పు రేపే!

తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే రోజులు దగ్గర పడుతున్నాయి. దివంగత ...

Widgets Magazine