శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (09:42 IST)

శశికళను తమిళనాడు జైలుకు తరలించకూడదు : కోర్టుకెక్కనున్న ఆప్

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను బెంగుళూరు జైలు నుంచి తమిళనాడు జైళ్లకు మార్చడానికి వీల్లేదని ఆమ్ ఆద్మీ అంటోంది. ఇందుకోసం న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రక

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను బెంగుళూరు జైలు నుంచి తమిళనాడు జైళ్లకు మార్చడానికి వీల్లేదని ఆమ్ ఆద్మీ అంటోంది. ఇందుకోసం న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రకటించి, ఇందులోభాగంగా కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
తమిళనాడుకు చెందిన ఆప్ నేత సుందరపాండ్యన్ మాట్లాడుతూ శశికళను చెన్నై లేదా తమిళనాడులోనే ఏదైనా జైలుకు తరలించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే రాష్ట్రానికి ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో శశికళను తమిళనాడులోని జైలుకు తరలిస్తే అధికార పార్టీ సభ్యులంతా ఆమె మాటవిని అక్రమార్జనకు పాల్పడతారని, రాష్ట్రం అధోగతి పాలవుతుందని వ్యాఖ్యానించారు. 
 
శశికళ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కర్నాటక జైలు నుంచి ఆమెను తమిళనాడు జైలుకి తరలించకూడదంటూ బెంగళూరు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సుందరపాండ్యన్ వెల్లడించారు.