Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు ముచ్చెమటలు.. జారుకుంటున్న ఎమ్మెల్యేలు... మా వాళ్లను పన్నీర్ కొనేస్తున్నారంటూ గగ్గోలు

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:30 IST)

Widgets Magazine
sasikala

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుధవారం రాత్రి వరకు తన గుప్పెట్లో ఉన్నట్టు కనిపించిన పలువురు ఎమ్మెల్యేలు ఇపుడు తుస్‌మంటూ జారుకుంటున్నారు. వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు జై కొడుతున్నారు. దీంతో అప్రమత్తమైన శశికళ.. పన్నీర్ సెల్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
గురువారం ఉదయం పోయెస్ గార్డెన్ ముందు చేరి పన్నీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ అభివాదం చేశారు. ఆపై ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, తన వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. పన్నీర్‌కు కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అన్నారు. ఆయన ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేస్తూ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ మండిపడ్డారు. 
 
దీంతో తన వర్గంలోని ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరంలోకి వెళ్లిపోతున్నారని అంగీకరించకుండానే శశికళ అంగీకరించినట్లయింది. మరోవైపు తన వెంట 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అవకాశం ఇస్తే, బలాన్ని నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం ధీమా చెప్పడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశిపై పన్నీర్ సర్జికల్ స్ట్రైక్స్.. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా పట్టుకురండి.. డీజీపీకి ఆదేశాలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.. తమిళనాడు ఆపద్ధర్మ ...

news

శశికళ సీఎం కాకుండా అడ్డుకోండి : ఒకే.. రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఒక ...

news

దిల్ ఉంటే.. ఎమ్మెల్యేలను విడిచిపెట్టండి.. శశికళ పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు లేదు: ఓపీఎస్

రాజకీయ బలం లేకపోయినా.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న మద్దతు పన్నీర్ సెల్వం పట్ల సానుభూతిని ...

news

చెన్నైకు రానున్న గవర్నర్.. తొలి పిలుపు పన్నీర్‌కే... ఎందుకంటే...

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైకు ...

Widgets Magazine