Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ దుస్థితికి పన్నీరే కారణం.. కూర్చొన్న కొమ్మనే నరికేశాడు : రిసార్టులో శశికళ ఆవేద‌న

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:53 IST)

Widgets Magazine

ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీతో పాటు తనకు ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మనం నమ్మిన పన్నీర్ సెల్వమే కారణమని రిసార్టులో ఉన్న తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వద్ద శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ తీర్పు వెలువడిన తర్వాత ఎమ్మెల్యేలతో శశికళ మాట్లాడుతూ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమన్నారు. మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని ఆవేద‌న చెందారు. మన పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని, అనంత‌రం జ‌య‌ల‌లిత‌ సమాధి వద్ద  ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దామ‌ని ఆమె వ్యాఖ్యానించారు.
 
పార్టీ నేత‌లంతా త‌న‌కు ఓ కుటుంబంలా అండగా ఉంటే తాను అన్నిటినీ సాధిస్తాన‌ని శశికళ అన్నారు. అమ్మ జ‌య‌ల‌లిత ఆశీర్వాదాలు త‌న‌కు ఉన్నాయ‌ని, 129 మంది ఎమ్మెల్యేల మద్దతు త‌న‌కు ఉందని, ఈ విషయంలో విజయం సాధించాక ఆ విజ‌యాన్ని జ‌య‌ల‌లిత‌కు అంకితమిద్దామ‌న్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రలను గెలిపించ‌కూడ‌ద‌ని ఆమె ఎమ్మెల్యేలను ప్రాధేయపడ్డారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా బలమేంతో శశికళకు అసెంబ్లీలో చూపిస్తా: పన్నీర్ సెల్వం

మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజల దృష్టిని మరల్చేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

news

పన్నీర్ మాత్రం సీఎం కాకూడదు... మీలో ఎవరైనా ఉండండి.. ఎమ్మెల్యేలతో శశికళ

ఇంతకాలం నమ్మినబంటుగా ఉండి తిరుగుబాటుతో వెన్నుపోటు పొడిచిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ ...

news

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్ ఇచ్చేయాలి.. సర్జికల్ స్ట్రైక్సే సరి: కమర్

పాకిస్థాన్ మాటి మాటికి కాలు దువ్వుతూ టెర్రరిస్టులను ప్రేరేపిస్తోందని రక్షణ శాఖ నిపుణుడు ...

news

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

Widgets Magazine