Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ జయమ్మ అదుపు తప్పారు: శశికళ భర్త నటరాజన్

మంగళవారం, 4 జులై 2017 (09:39 IST)

Widgets Magazine

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రోజూ ప్రభుత్వం కోసం 20 గంటలు కష్టపడటం ఆరోగ్యానికి హానిగా మారిందని శశికళ భర్త, రచయిత నటరాజన్ తెలిపారు. జయలలిత మృతిలో ఎలాంటి రహస్యం లేదన్నారు. జయలలిత మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటరాజన్ మాట్లాడుతూ... అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని ఎన్నికల కమిషన్‌ ఆదేశించలేదని, ఒకవేళ ఆదిశించినా శశికళ మళ్లీ ఆ పదవికి పోటీ చేస్తారన్నారు. 
 
జయలలితకు ఐదుగురు కార్యదర్శులు ఉండేవారని, తాము శశికళతో పాటు దూరంగా ఉన్నామన్నారు. ఆమెకు ఏమైందో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. కనీసం మంత్రులైనా ఆమె ఆరోగ్యపరిస్థితిపై హెచ్చరించలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా అన్నాదురై జయంత్యుత్సవాల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడానికి కూడా సాధ్యపడక ఆమె తడబాటుకు గురయ్యారన్నారు. అప్పట్లో ఒకసారి ఆమె సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ అదుపు తప్పినప్పుడు సమీపంలోని భద్రతాధికారి చేయూతనందించారని నటరాజన్ తెలిపారు. ఇవన్నీ ఆమె ఆరోగ్యపరిస్థితిని సూచిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
 
జయలలిత మృతి పట్ల ఎలాంటి రహస్యాలు లేవని, ఆసుపత్రిలో చేరడానికి ముందు జయలలిత వెంట ఆమె వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నారని, ఆయనను అడిగినా నిజాలు చెబుతారని ఆయన తెలిపారు. వారంతా ఎందుకు నోరిప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అపోలో వైద్యులతోపాటు, విదేశీ నిపుణులు, ఎయిమ్స్ వైద్యులు కూడా వాస్తవాలు వెల్లడించారని గుర్తు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'డోక లా' మాదే.. తేడా వస్తే యుద్ధమే : భారత్‌కు చైనా పరోక్ష వార్నింగ్

భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ...

news

కుమార్తెల పేరిట వీసాలు.. అమెరికా, మెక్సికోలకు మైనర్ల తరలింపు.. కవల కుమార్తెలను?

మైనర్ బాలికలను అక్రమంగా తరలించి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ ...

news

దిలీప్‌ రెండో భార్య, నటి కావ్యామాధవన్‌ను విచారిస్తున్న పోలీసులు?

మలయాళ స్టార్ హీరో దిలీప్‌ను విచారించిన పోలీసులు ఆయన రెండో భార్య, నటి కావ్యా మాధవన్ ...

news

నగదు రహితం దెబ్బకు బ్యాంకులపైనే నమ్మకం పోయిందా...డిపాజిట్లు లేక అల్లాడుతున్న బ్యాంకులు

నగదు రహితం, పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు తాజాగా జీఎస్టీ అంటూ కేంద్రప్రభుత్వం ఎంత అడ్డగోలు ...

Widgets Magazine