శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:07 IST)

చిన్నమ్మ దొంగ.. జైలుకెళ్లిన శశి పాట ఇక ఆపండి.. మీడియాపై నెటిజన్ల ఫైర్.. జనాల్ని పిచ్చోళ్లు చేయొద్దు..

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ప్రజల పక్షాన నిలిచిన పన్నీర్ సెల్వంను పక్కనబెట్టి.. చివరి నిమిషంలోనూ పంతం నెగ్గించుకుని స్వార్థంగా వ్యవహరించిన శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జైలు చేస్తున్న ప్రతి వి

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ప్రజల పక్షాన నిలిచిన పన్నీర్ సెల్వంను పక్కనబెట్టి.. చివరి నిమిషంలోనూ పంతం నెగ్గించుకుని స్వార్థంగా వ్యవహరించిన శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జైలు చేస్తున్న ప్రతి విషయాన్ని మీడియా హైలైట్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

చిన్నమ్మ త్యాగం చేసి జైలుకెళ్లలేదని.. ప్రజల సొమ్ము దోచుకుని జైలులో కూర్చుందని.. అలాంటి మనిషి జైలులో చేసే ప్రతి విషయాన్ని రాయడం ఆపండని.. నెటిజన్లు అంటున్నారు. అంతేగాకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ.. ఆమెపై నేరాలున్నాయని అలాంటి వ్యక్తి గురించి మీడియా హైలైట్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై వాటి పరిష్కారంపై, సామాజిక అభివృద్ధిపై మీడియా దృష్టి పెడితే మంచిదని.. రేటింగ్ కోసం పాకులాడవద్దని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. 
 
ఇంకా... బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో సాధారణ ఖైదీగా ఉన్న శశికళకు గురువారం ఉదయం జైలు అధికారులు ఉపాహారంగా పులోహోర, పచ్చడి అందించారు. ఉదయం కొద్దిసేపు ఆమె ధ్యానం చేశారని, తమ రాష్ట్ర రాజకీయాలను శ్రద్ధగా గమనిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఆమె నేలపైనే పడుకున్నారట. శశికళకు బెడ్ ఇవ్వాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.

శశికళ ఉన్న సెల్ లో ఆమెతో బాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు... మీడియాలో వచ్చిన వార్తలపై.. జనాన్ని పిచ్చోళ్లని చేసిన శశికళకు ఇంత ప్రాధాన్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. శశికళ జైలులో ఉన్నా.. మన్నార్ గుడి మాఫియా మాత్రం తమిళనాడులో ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఆమె ప్రజా ధనాన్ని దోచుకున్న దొంగ అంటూ..  నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు.