Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయ సమాధిపై శపథం చేసి బెంగుళూరుకు శశికళ పయనం... బేరసారాలకు దిగిన పన్నీర్ వర్గం

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:21 IST)

Widgets Magazine
sasikala - jayalalithaa

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరుకు బయల్దేరారు. పోయస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు. తొలుత మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధిని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం నేరుగా బెంగళూరు వెళ్లి, ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. అక్కడ నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం కేంద్ర కారాగారానికి ఆమెతోపాటు.. ఈ కేసులో శిక్ష పడిన ఇళవరి, సుధాకరన్‌లను తరలించనున్నారు. 
 
శశికళ పోయెస్ గార్డెన్‌కు బెంగుళూరుకు కదిలిందో లేదో... పన్నీర్ సెల్వం వర్గం రంగంలోకి దిగింది. ఇప్పటికీ రిసార్టులోనే ఉన్న పలువురు ఎమ్మెల్యేలను కలిసి వారు పునరాలోచించుకోవాలని కోరేందుకు పన్నీర్ సెల్వం వర్గ నేత, మంత్రి పాండ్యరాజన్ గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శశికళ ఆదేశం మేరకు తీసుకున్న నిర్ణయాలను పక్కనబెట్టి, పన్నీర్ సెల్వంకు మద్దతు పలకాలని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఎమ్మెల్యేలకు ఆయన హితబోధ చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా... పార్టీలో దివంగత జయలలిత నమ్మిన వ్యక్తి పన్నీర్ సెల్వమేనని వారికి గుర్తు చేసి, ఆయన వెనుకే నడుద్దామని పాండ్యరాజన్ కోరనున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chinnamma Leaves Stops Bengaluru Jail Sasikala Live Amma Memorial

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోయెస్ గార్డెన్ నుంచి శశి చుట్టాలందరూ వెళ్ళిపోండి.. దీపతో పన్నీర్ రెఢీ.. చిన్నమ్మ కసి తీర్చుకుంటుందా?

చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. ...

news

అధికారంలోకి డీఎంకే వస్తుందా..? ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ ఎందుకు.. పన్నీర్‌కు కన్నీరేనా?

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

దినకరన్‌కు పార్టీ పదవి... చీలిక దిశగా అన్నాడీఎంకే ... పన్నీర్ సారథ్యంలో అమ్మ డీఎంకే

అన్నాడీఎంకే అడుగులు చీలిక దిశగా పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ...

news

ప్రేయసికి కొత్త కారు.. ఆపై దానిని 2వేల రూపాయలతో అలకరించాడు.. కానీ జైలుకెళ్లాడు..

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని ...

Widgets Magazine