గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (03:03 IST)

శశికళ నమ్మినబంటు ఇంత ఝలక్ ఇచ్చాడా? ఎవరు కారణం?

శశికల శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన తమిళనాడు విద్యాశాఖ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్ హఠాత్తుగా ఓపీఎస్‌ గూటికి ఎందుకు చేరారు మంత్రి నిర్ణయం వెనుక ఎవరున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఆరా తీస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్లు పలు ఆసక్తికర అంశాలు వెలుగ

శశికల శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన తమిళనాడు విద్యాశాఖ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్ హఠాత్తుగా ఓపీఎస్‌ గూటికి ఎందుకు చేరారు మంత్రి నిర్ణయం వెనుక ఎవరున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఆరా తీస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్లు పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 
 
బడా వ్యాపారవేత్త అయిన పాండ్యరాజన్‌కు సుదీర్ఘకాలంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సత్సంబంధాలున్నాయి. రెండేళ్ల క్రితం డీఎండీకే పార్టీ నుంచి విడివడి అన్నాడీఎంకేలో చేరిన పాండ్యరాజన్‌కు జయ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతోపాటు మంత్రి పదవీ కట్టబెట్టారు. ఇందుకు శశికళ కూడా సహకరించారు. 
 
అందుకే ఆయన ఆది నుంచి శశికళ పక్షానే నిలిచారు. పన్నీర్‌ సెల్వంను కూడా ఆయన విమర్శించారు. పార్టీని నిలబెట్టుకొనేందుకు శశికళకు అండగా నిలబడకుండా ఇలా రోడ్డెక్కడం సరికాదంటూ పన్నీర్‌కు హితోక్తులు చెప్పారు. అందుకే పాండ్యరాజన్‌ తనకు నమ్మినబంటు అన్న ఉద్దేశంతో శశికళ ఆయన్ను శిబిరంలో పెట్టకుండా స్వేచ్ఛగా ఉంచారు. 
 
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం అరుణ్‌ జైట్లీ పాండ్యరాజన్‌కు ఫోన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓపీఎస్‌కు సహకరించాలని ఆయన నచ్చచెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాతే పాండ్యరాజన్ మనసు మార్చుకున్నారు. జైట్లీ సూచనల మేరకు పన్నీర్‌ సెల్వంకు జైకొట్టారు.