Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జైలులో చిన్నమ్మకు హైఫై వసతులుండవ్.. కామన్ రూమే ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఆదేశాలు

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (15:13 IST)

Widgets Magazine

దేశం మొత్తాన్ని తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేసిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి.. అక్రమాస్తుల కేసు ద్వారా చెక్ పడింది. సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చినా.. అరెస్ట్ చేసిందుకు కొద్ది గడియల్లోనే చిన్నమ్మ చక్రం తిప్పేసింది. పన్నీరును తొలగించి పళని సామిని పైకి తెచ్చింది. అయితే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత అన్నాడీఎంకే పార్టీని తన ఆధీనంలో తీసుకోవాలనుకున్న శశికళ చిప్పకూడు ఖాయమైపోయింది. 
 
అంతేగాకుండా జైలులో చిన్నమ్మకు సాధారణ వసతులే ఉంటాయి. అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు ముగ్గుర్ని సుప్రీం దోషులుగా తేల్చింది. 500 పేజీలతో ఈ కేసు తీర్పు వెలువడింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇంకా శశికళతో పాటు జైలుకు వెళ్ళనున్న ముగ్గురికి జైలులో ప్రత్యేక వసతులు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.  
 
గతంలో దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడిపినప్పుడు ఎ-కేటగిరీతో కూడిన వసతులను ఆమెకు కల్పించారు. అయితే చిన్నమ్మకు ప్రత్యేక వసతులు కల్పించకూడదని న్యాయవాదులు తెలిపారు. చిన్నమ్మకు అందరికీ ఇచ్చే కామన్ రూమే ఇవ్వాలన్నారు. ఈ తీర్పు ప్రతిలో న్యాయవాదులు తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నేరస్థులపై సుప్రీం ఫైర్ అయ్యింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీరును పక్కనబెట్టేశారు.. పళని సామిని పైకితెచ్చారు.. అంతా బీజేపీ మాయ!? శశి-తంబిదురై చక్రం తిప్పారా?

పన్నీర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, సీఎం అభ్యర్థిగా పళనిసామి పేరును ...

news

శశి'కల' కల్లలైన వేళ... శశి 'సింహం'ను బోనులో పెట్టిన కేసు ఇదీ...

దొంగ అనేవాడు పట్టుబడినా నేరం రుజువయ్యే వరకూ తను దొరేనంటూ బుకాయిస్తాడు. పైగా ...

news

పన్నీరును పార్టీ నుంచి వెలివేశారట.. సీఎం అభ్యర్థిగా పళనిసామి.. గవర్నర్ ముందు రెండే ఆప్షన్లు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎం పదవి చేపట్టేందుకు ఛాన్స్ లేదని అన్నాడీఎంకే ...

news

శశికళను అమ్మ ఆత్మ పట్టుకుందా? సీఎం అన్నందుకు కసి తీర్చుకుందా?

తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ...

Widgets Magazine