Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ భర్తకు జైలుశిక్ష... లగ్జరీ కారు దిగుమతి కేసులో...

శుక్రవారం, 17 నవంబరు 2017 (15:24 IST)

Widgets Magazine
sasikala - natarajan

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం నటరాజన్‌కు రెండేళ్ళ జైలుశిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. రూ.1.62 కోట్ల విలువ చేసే లగ్జరీ కారును విదేశాల నుంచి 2009లో నటరాజన్ దిగుమతి చేసుకున్నారు. దీనికి పన్ను చెల్లించక పోవడంతో సీబీఐ కేసు నమోదు చేయగా, కేసు విచారణ కూడా సీబీఐ కోర్టులో జరిగింది. 
 
ఈ విచారణ అనంతరం 2010లో సీబీఐ కోర్టు నటరాజన్‌తో పాటు.. నలుగురిని దోషులుగా నిర్ధారించి, రెండేళ్లు జైలుశిక్షను విధించింది. దీంతో ఆ నలుగురు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయగా, కిందికోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు ఖరారు చేసింది. కాగా, ఈ కేసులో అక్రమాస్తుల కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ బంధువు భాస్కరన్ కూడా ఉండటం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ...

news

దొంగగా మారిన టెక్ కంపెనీ ఉద్యోగి.. దోపీడికి వెళ్లి కత్తి చూపెట్టి.. 50మందిపై అత్యాచారం

దొంగతనం చేసే ఓ దొంగ.. కత్తిని చూపి డబ్బు, నగలతో పాటు మహిళల శీలాన్ని కూడా దోచుకున్నాడు. ...

news

అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ...

news

భర్త డబ్బులు చెల్లించలేదనీ భార్య పైటకొంగుబట్టి లాగిన వ్యాపారి!

కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న ...

Widgets Magazine