శశి గొంతెమ్మ కోర్కెలు... జైలు గదిలో ఏసీ, హాట్ వాటర్, టీవీ... న్యాయమూర్తి సీరియస్

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (19:14 IST)

sasikala

శశికళ తన తడాఖా ఏమిటో తమిళనాడు నుంచి బెంగళూరు వరకూ తన కాన్వాయ్ తో చెప్పేసింది. ఈ కాన్వాయ్ చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న జయలలిత సైతం ఇంత హడావిడి చేయలేదనీ, జైలు శిక్ష అనుభవించేందుకు వెళుతే ఇంత పెద్దఎత్తున ఊరేగింపుగా శశికళ రావడంపై న్యాయమూర్తి ఒకింత ఆగ్రహానికి గురైనట్లు సమాచారం వస్తోంది. 
 
కాగా జైలులో లొంగిపోయేందుకు వెళ్లిన శశికళ గొంతెమ్మ కోర్కెలు కొన్నింటిని న్యాయమూర్తి ముందు వుంచింది. తనను ప్రత్యేక ఖైదీగా చూడాలనీ, తనకు విడిగా అన్ని వసతులు వున్న గదిని కేటాయించాలనీ, దానికి ఏసీ, ఒక టీవీ, వేడివేడి నీరు, మెత్తని బెడ్ తదితరాలన్నీ కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఐతే శశికళ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆమెను ఓ సాధారణ ఖైదీలా పరిగణించాలనీ, ఆమెతో పాటు మిగిలినవారిని కూడా అలాగే చూడాలని ఆదేశించారు.
 
దీనితో ఆమెకు ఖైదీ నెం. 10711 నెంబరును కేటాయించి, తెల్లచీర ఒకటి ఇచ్చి సాధారణ ఖైదీలుండే కారాగారానికి తరలించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు ఖైదీలుంటారు. వీరంతా ఒకే గదిలోనే వుంటారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా వున్నారు కనుక ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు కానీ శశికళ విషయంలో అలాంటివేవీ నియమించే అవకాశం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెసార్ట్‌లో ఎమ్మెల్యేల మస్తు మజా.. చిన్నమ్మ బిల్లు కట్టి జైలుకెళ్లారా? లేకుంటే పన్నీర్ కట్టాలా? (ఫోటోలు)

తమిళ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభంతో శశికళ వెంట నిలిచిన ఎమ్మెల్యేలు మస్తు మజా చేశారు. ...

news

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు ...

news

అన్నాడీఎంకేలో చీలిక.. డీఎంకే వ్యూహం.. త్వరలో ఎన్నికలు వస్తాయ్: స్టాలిన్ జోస్యం

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ...

news

Mannargudi Mafia is Back... ఎమ్మెల్యేలను వదలం... తమిళనాడు డీజీపికే సవాల్?

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ ...