Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విద్యాసాగర్‌తో శశికళ భేటీ.. సీఎం ఛాన్సివ్వండి సార్ అంటూ విజ్ఞప్తి.. అక్రమాస్తుల కేసు వచ్చే వారానికి?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:28 IST)

Widgets Magazine

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో శశికళ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శశికళ వెంట 10 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు శశికళ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను శశికళ కోరింది.

తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో చిన్నమ్మ చర్చించారు. పన్నీర్ సెల్వం వ్యవహారంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ విద్యాసాగర్‌ను కోరారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. 
 
ఇదిలా ఉంటే.. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదు కాలేదు. దీంతో, ఈ కేసుపై తీర్పు వచ్చే వారంలో వెలువడే అవకాశముందని సమాచారం. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కర్ణాటకలోని దిగుర కోర్టు దోషిగా తేల్చడం, ఈ తీర్పును సవాల్  చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జయలలిత మృతి చెందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫేస్‌బుక్ పరిచయం: మోడలింగ్ ఛాన్స్.. పాలలో మత్తుమందిచ్చి రేప్-వీడియో తీసి బ్లాక్‌మెయిల్

సోషల్ మీడియాతో జరిగే మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. సోషల్ మీడియా ప్రభావంతో మోసాలు ...

news

తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట ...

news

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ ...

news

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి ...

Widgets Magazine