Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెరసాలలో చిన్నమ్మ.. ఆదివారం నుంచి పని... రోజుకు రూ.50 కూలి

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:31 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇపుడు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. జయ అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన విషయం తెల్సిందే. దీంతో బుధవారం కోర్టులో లొంగిపోగా, ఆ తర్వాత జైలుకు తరలించారు. 
 
అక్కడ ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. దీంతో ఏదో ఒక పని ఎంచుకోవాల్సి ఉంది. శశికళ రోజు కూలీ రూ.50లుగా జైలు అధికారులు నిర్ణయించారు. ఈ ఆదివారం నుంచి పని కేటాయించనున్నారు. పని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని అధికారులు ఆమెకే వదిలేశారు. 
 
సాధారణ ఖైదీలు మాదిరిగానే ఇద్దరు.. ముగ్గురు ఖైదీలు ఉండే సెల్‌లోనే శశికళను ఉంచనున్నారు. జైలు నిబంధనల ప్రకారం... ఉదయం 6.30 గంటలకు అల్పాహారం, 11.30 గంటలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 7 గంటలకు భోజనం అందిస్తారు. శశికళ ప్రత్యేక దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె జైలు దుస్తులనే ధరించారు. 
 
జైల్లో శశికళకు ఏసీ రూమ్‌, వేడినీళ్లు, ఇంటి భోజనం, సహాయకురాలిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని అమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. శశికళ గతంలో ఈ కేసుకు సంబంధించి ఆరు నెలలు ఇదే జైల్లో ఉన్నారు. అపుడు జయలలిత వెంట ఉండటంతో ఆమెకు వీఐపీ సౌకర్యాలు లభించాయి. కానీ, ఇపుడు సాధారణ ఖైదీ కావడంతో ఇవేమీ దక్కలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖైదీ నెం.9234: చిన్నమ్మ జైలు మెనూలో 2 చపాతీలు, రైస్, రాగిముద్ద, సాంబార్- రోజుకి రూ.50 వేతనం

బెంగళూరు కోర్టులో చిన్నమ్మ లొంగిపోయారు. ఆపై పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. జైలులో ...

news

విజయవాడ : కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి పదేళ్ల జైలు

కన్నబిడ్డ అనే విషయాన్ని మరిచిపోయి అత్యాచారం జరిపిన కన్నతండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష ...

news

భయపెట్టే గదులు.. కంపుకొట్టే మరుగుదొడ్లు.. ఇదే పరప్పణ అగ్రహార జైలు

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుపై అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ...

news

జగన్ ముగ్గురాళ్లు దోచుకుంటే? నీవు విషపు మొక్కను నీళ్లు పోసి వటవృక్షం చేస్తున్నావా?

కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం టీడీపీలో చేరిన సందర్భంగా ఏపీ ...

Widgets Magazine