శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:01 IST)

శశికళ వర్సెస్ శశికళ.. ప్రధానికి వరుసబెట్టి లేఖలు.. అమ్మను కిందకు తోసింది ఎవరు?

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభా పక్ష నేత శశికళ నటరాజన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. శశికళ నటరాజన్‌కు ప

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభా పక్ష నేత శశికళ నటరాజన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. శశికళ నటరాజన్‌కు ప్రజామోదం లేదని స్పష్టం చేశారు. ప్రజాదరణ లేని వ్యక్తి సీఎం కాలేరన్నారు. ప్రమాణ స్వీకారంలో జాప్యం జరగడంపై ప్రశ్నలు సంధించారు. గవర్నర్ సమయం తీసుకుంటుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆమెకు కేవలం నేరమయం చేయడం మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి అన్నాడీఎంకే అధినేత శశికళ కూడా లేఖ రాశారు. తన ప్రమాణస్వీకారంలో జాప్యానికి గల కారణాన్ని ఆ లేఖలో వివరించారు. కాగా శశికళ వర్గం పెట్టిన ఇబ్బందులతోనే అమ్మ మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని, ఆమెను ఆ వర్గమే చంపేసిందన్న చందంగా అన్నాడీఎంకే సీనియర్ నేత పాండ్యన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపాయి. 
 
పోయస్ గార్డెన్‌లో సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన ఘర్షణలో అమ్మ కిందపడిపోయారని.. ఆమెకు చేయూత నిచ్చేందుకు పక్కన ఎవ్వరూ లేరని.. ఆపైనే ఆమె ఆస్పత్రి పాలయ్యారని పాండ్యన్ చేసిన వ్యాఖ్యలకు శశికళ వర్గం కౌంటర్ ఇచ్చింది. ఈ విషయాన్ని అమ్మ బతికున్నప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెప్తున్నారని వారు ప్రశ్నించారు. ఇంతకీ అమ్మను కిందకు తోసిన వ్యక్తి ఎవరనేదానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. దీనికంతా చిన్నమ్మే కారణమా అంటూ సెటైర్లు, కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.