శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:38 IST)

చిన్నమ్మకు సీఎం పోస్ట్ కావాలి.. మరి ఈ లేఖ ఎందుకు రాసినట్టు?: పన్నీర్ ప్రశ్న

పోయెస్ గార్డెన్ నుంచి శశికళను దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. అమ్మ 2012లోనే గెంటివేశారనే విషయాన్ని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. 2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన

పోయెస్ గార్డెన్ నుంచి శశికళను దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. అమ్మ 2012లోనే గెంటివేశారనే విషయాన్ని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. 2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఆ లేఖను ప్రస్తుతం పన్నీర్ సెల్వం బయటపెట్టారు. 
 
ఆ లేఖలో మా బంధువులు, మిత్రులు కొంతమంది తాను పోయెస్‌గార్డెన్‌లో కలిసి ఉంటున్న సమయంలో తన పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు.  అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు(జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ తనకు తెలియకుండానే జరిగాయి. కలలో కూడా తాను మీకు ద్రోహం తలపెట్టననని చెప్పారు. 
 
తన బంధువులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇది మన్నించరానిది. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలనిగానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదన్నారని పన్నీర్ సూచించారు. అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ తనకు లేదని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు. తన జీవితాన్ని మీ కోసమే అర్పించాను. తనను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండని ఆ లేఖలో శశికళ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. శశికళ శిబిరంలో 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ వర్గం చెప్పుకున్నా.. నిజానికి 87 మంది శాసనసభ్యులే ఉన్నట్లు సమాచారం. మరోవైపు పన్నీర్ సెల్వం వద్ద నేరుగా ఐదుగురు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. మరో ఎమ్మెల్యే సెల్వం శిబిరంలో చేరినట్లుగా తెలియవచ్చింది. మరికొంతమంది నేతలు సెల్వం నివాసానికి వస్తున్నారు. అయితే వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా లోపలికి వెళ్లిపోతున్నారు. పన్నీర్ సెల్వం వైపు ఉన్న 40 మంది శాసనసభ్యులు ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు.