Widgets Magazine

కర్ణాటకలో ఐతే సరే.. ఆంధ్రలో అయితే ఊచలు లెక్కెట్టవలసిందే..

బుధవారం, 24 మే 2017 (15:41 IST)

siddaramaiah

ఎన్నికలు దగ్గరవుతున్నప్పుడు నాయకులకు పబ్లిసిటీ సరదా పుడుతుంది. ఉచితాలు, కరెన్సీ నోట్లు వగైరాలతో ఓటర్లకు విసిరే ప్రలోభాల వల ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది కానీ, ఈలోపు నెటిజన్లను మంచి చేసుకుందామనుకున్నారు పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కానీ ఆ ప్రయత్నంలో కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయ్యింది. 
 
వివరాల్లోకి వెళ్తే - సోమవారం సిద్ధరామయ్య ఓ ట్వీట్ చేసారు. విఐపి కాన్వాయ్‌ల వైపు ఆంబులెన్సులు వస్తే, వాటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పానని, సిబ్బంది సైతం ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఓ ఆంబులెన్సుకు తన కాన్వాయ్ దాటేలా అనుమతించారని దాని సారాంశం. ఇక నెటిజన్ల కీబోర్డుల టకటకలు ముఖ్యమంత్రిగారికి ఓ రేంజిలో తలనొప్పి తెప్పించాయి. ఇది కూడా ఓ ఘనకార్యమా అంటూ ఒకరు.. ఈ సేవకు మీకు తప్పకుండా నోబెల్ బహుమతి ఇవ్వవలసిందేనంటూ మరొకరు.. సిఎం అని కూడా చూడకుండా చెడుగుడు ఆడేశారు.
 
ఈ మొత్తం వ్యవహారం మీద ఆంధ్ర నాయకుల కామెంట్ మరోలా ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే వ్యంగ్యాస్త్రాలు విసిరితే, కర్ణాటక కాబట్టి సరిపోయింది కానీ, ఆంధ్రలో ఐతే కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నరకం చూపుతారని బాహటంగానే విమర్శిస్తున్నారు. బహుశా ఆంధ్రగాలి ఇంకా కర్ణాటక వైపు మళ్లలేదేమో...


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళలూ... కత్తులు.. చాకులు వెంటపెట్టుకోండి.. అలాంటివారి మర్మాంగాలు కోసెయ్యండి : నన్నపనేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

రోజూ పీకలదాకా మద్యం సేవించి రావడం... కన్నబిడ్డపై అత్యాచారం చేయడం... ఎక్కడ?

12 యేళ్ల కుమార్తెను బెదిరించి లొంగదీసుకుని గత ఆర్నెల్లుగా కామవాంఛ తీర్చుకుంటూ వచ్చిన ...

news

తెలంగాణాలో బీజేపీ అధికారం సాధ్యమా...?

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్ షా పర్యటనపైనే చర్చ. దక్షిణాది ...

news

అమ్మ పోలికలు మినహా మీ అర్హతేంటి దీపమ్మా... నీ భర్తే నిన్ను ఛీకొట్టారంటూ రజనీ ఫ్యాన్స్ దెప్పిపొడుపులు

వెయిటింగ్ అయిపోయింది. దేవుడు శాసించేసాడు.. ఇక రాజకీయరంగంలో యుద్ధానికి సిద్ధం కావడమేనంటూ ...