శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi

ట్రిపుల్ తలాక్‌పై నాలుగు వారాల్లో స్పందించండి!... కేంద్రానికి సుప్రీంకోర్టు

ట్రిపుల్ తలాక్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తెలియజేయాలని కోరింది. దీంతో ట్రిపుల్ తలాక్ అంశం కేంద్రం మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

ట్రిపుల్ తలాక్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తెలియజేయాలని కోరింది. దీంతో ట్రిపుల్ తలాక్ అంశం కేంద్రం మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.
 
పెళ్లి చేసుకున్న మహిళకు కేవలం మూడు సార్లు తలాక్ చెబుతున్న ముస్లిం పురుషులు క్షణాల్లో విడాకులు తీసుకుంటున్నారని, ఈ సంప్రదాయాన్ని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పలువురు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం... సోమవారం కూడా మరోమారు విచారణ చేపట్టి ధర్మాసనం నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.