Widgets Magazine

''పద్మావత్''పై నిరసన: స్కూలు బస్సుపై దాడి.. చిన్నారులు భయంతో? (వీడియో)

బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదలకు నిరసనగా రాజ్‌పుత్ కర్ణిసేనల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో

selvi| Last Updated: గురువారం, 25 జనవరి 2018 (10:46 IST)
బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదలకు నిరసనగా రాజ్‌పుత్ కర్ణిసేనల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో స్కూలు చిన్నారులకు భయానక అనుభవం ఎదురైంది. గుర్గావ్‌లో ఓ స్కూలు బ‌స్ వెళుతుండ‌గా దానిపై ఆందోళ‌నకారులు దాడి చేశారు.

బ‌స్సు అద్దాల‌న్నీ ప‌గిలిపోయాయి. దీంతో చిన్నారులు అంద‌రూ బ‌స్సు సీట్ల కింద దాక్కుని ప్రాణ భ‌యంతో వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స్కూలు బస్సును కూడా వదిలిపెట్టని ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సు అద్దాలను పగులకొట్టారు. దీంతో బస్సులోని చిన్నారులు సీట్ల కింద దాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


దీనిపై మరింత చదవండి :