శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 30 జులై 2016 (17:26 IST)

మా AN-32 ఆచూకి చెప్పరూ... అమెరికాకు భారత్ అభ్యర్థన... విశాఖ అడవుల్లో జనం వెతుకులాట...

గత 22వ తేదీన చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళుతూ గల్లంతయిన ఏఎన్-32 విమానం ఆచూకి కోసం భారత వైమానిక, నావికాదళం తీవ్రంగా శ్రమించినా ఇప్పటివరకూ దాని ఆచూకి లభించలేదు. దీనితో గల్లంతయిన విమానం ఆచూకిని కనుగొనాలని అమెరికాను అభ్యర్థించింది భారతదేశ ప్

గత 22వ తేదీన చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళుతూ గల్లంతయిన ఏఎన్-32 విమానం ఆచూకి కోసం భారత వైమానిక, నావికాదళం తీవ్రంగా శ్రమించినా ఇప్పటివరకూ దాని ఆచూకి లభించలేదు. దీనితో గల్లంతయిన విమానం ఆచూకిని కనుగొనాలని అమెరికాను అభ్యర్థించింది భారతదేశ ప్రభుత్వం. విమానం గల్లంతుపై విమానయాన మంత్రి మాట్లాడుతూ... విమానం గల్లంతు పెద్ద పజిల్‌లా మారిందనీ, దాని ఆచూకి ఎక్కడో ఇప్పటివరకూ కనుగొనలేకపోయినట్లు వెల్లడించారు. 
 
విమానం ఆచూకి లభించకపోవడంపై తను కూడా తీవ్రంగా కలత చెందినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐతే ఖచ్చితంగా విమానం ఆచూకి తెలుసుకునేవరకూ అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఇందుకుగాను అమెరికా సాయం కోరనున్నట్లు తెలిపారు. అమెరికా ఉపగ్రహాల్లో తమ విమానం ఆచూకి ఏమయినా ఉంటే తెలుపాలని కోరినట్లు వెల్లడించారు.
 
మరోవైపు 22వ తేదీ నాడు విశాఖ అడవుల్లో ఓ విమానం చక్కెర్లు కొట్టినట్లు అక్కడి గిరిజనులు చెపుతున్నారు. దీనితో విశాఖలోని అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.