శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:51 IST)

విజృంభించిన స్వైన్ ఫ్లూ... అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమలు..!

దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభించడంతో ఆయా రాష్ట్రాల్లో వ్యాధిని ఎదుర్కొనేందుకు పలు విధాల చర్యలు చేపడుతున్నారు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రజలు రోడ్లపై గుంపులుగా కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది కలిసి వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా, అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.