Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హోం మంత్రి చెప్పులకు సెక్యూరిటీ... ఎక్కడ? ఏమిటి?

గురువారం, 17 మే 2018 (14:01 IST)

Widgets Magazine
cheppals

సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు రక్షణగా భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డు)ని నియమించుకోవడం సహజం. కానీ, మంత్రులు, ఎమ్మెల్యే చెప్పులకు కూడా భద్రతా సిబ్బందిని నియమించుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ చెప్పులకు ఓ వ్యక్తి కాపలాగా ఉండటం మీడియా కంటపడింది. అంతే ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇపుడు వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ బుధవారం మహాకాళి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విడిచిన శాండిల్స్‌(చెప్పులు)ను ఎవరూ పట్టుకుపోకుండా చూసేందుకు ఆలయ ఉద్యోగి ఒకరు గంటపాటు కాపలాగా ఉన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి తిరిగి వచ్చి, ఆ చెప్పులు వేసుకునే వరకూ అతను అలానే నిలుచునే ఉన్నారు. 
 
కాగా, మే 11న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మహాకాళి మందిరాన్ని దర్శించుకున్నప్పుడు ఆయన చెప్పులు మాయమయ్యాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే జ్యోతిరాదిత్యకు నూతన చెప్పులు కొనిచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మంత్రి భూపేంద్ర సింగ్ శాండిల్స్‌కు ఈ విధమైన రక్షణ కల్పించారని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేక పోయారు.. ఇక 8 మందిని ఎలా ఆకర్షిస్తారు : జవదేకర్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్రమంత్రి, కర్ణాటక రాష్ట్ర ...

news

మావోయిస్టు కీలక నేత ఆర్కేను చుట్టుముట్టారా? భారీ ఎన్‌కౌంటర్?

మావోయిస్టు కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు ...

news

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. బోరున విలపించిన సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం ...

news

ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి భారతావని మౌనం పాటిస్తోంది : రాహుల్ ట్వీట్

ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా భావించే భారత ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని యావత్ భారతావని ...

Widgets Magazine